ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగిం చింది. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్ల కోర్టు తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్‌ను దాదాపు వారం రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ కాన్వెన్షన్ కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్‌రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడై నట్లు తెలుస్తోంది. అయితే నాలుగో రోజు కస్టడీలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించి ఆ తరువాత కోర్టులో హాజరుపర్చారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారు లను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుప తన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నెలరోజులు గడుస్తున్న కొన్ని ఆధారాలు మాత్రమే లభించాయి.ఈ నేపథ్యంలో ఈ కేసు కోసం ప్రత్యేక పీపీని ప్రభుత్వం నియమించనుంది. ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


