‘శశివదనే’ నుంచి ‘వెతికా నిన్నిలా…’ సాంగ్ రిలీజ్

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’, గోదారి అటువైపో.. పాట‌ల‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ స్పంద‌న‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి వెతికా నిన్నిలా…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. శ‌ర‌వ‌ణ భాస్క‌ర‌న్‌ సంగీతం అందించిన ఈ పాట‌ను స‌త్య యామిని పాడారు. కిట్టు విస్సా ప్రగడ రాశారు. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.

నటీనటులు:

రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ – గౌరీ నాయుడు, బ్యానర్స్ – ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు – అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం – సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ – శ్రీసాయి కుమార్ దారా, సంగీతం – శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ – అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ – జేడీ, సి.ఇ.ఒ – ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ – సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).

Latest Articles

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్