కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌

         కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. సింహాద్రి పవన్‌ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో చేపట్టిన మూడు ర్యాలీలతో వైసీపీ ఫ్యాన్‌ మూడు రెక్కలు విరిగాయన్నారు బాలశౌరి. అవనిగడ్డలో జనసేన విజయం ఖాయమైందన్నారు. అవని గడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్, ఎంపీగా తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి సుసాధ్య మన్నారు. గతంలో దివిసీమలో 19వేల ఎకరాల రొయ్యల చెరువుల్ని పూడ్పించి వరి సాగు భూములుగా మార్చిన విషయాన్ని గుర్తు చేసారు. అవనిగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ తీరుపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు బాలశౌరి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్