ఈ సందర్బంగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అని చెప్పారు. ఒక దేశం, ఒకే విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించామని.. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయతను కోల్పోయారని చెప్పారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. ప్రజా దర్బార్‌లో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. అలాగే అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో డీబీవీ స్వామి, దేవినేని ఉమ, చినరాజప్ప, అశోక్ బాబు పాల్గొన్నారు.