అల్లు అర్జున్ అరెస్టుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని విమర్శించారు. సినీ నటులను కించపర్చేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. నటులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకంత చులకన భావం అని ప్రశ్నించారు లక్ష్మణ్.