పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఇంధన పొదుపు ఎంతో అవసరం అని ఏపీ సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రత్యామ్నాయ వనరులను వినియోగించకపోత నష్టపోతామన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరగాలని, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. సోలార్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంగా తీసుకోవాలన్నారాయన. ఇంధనం పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడం వారోత్సవాల ప్రధాన ధ్యేయం అన్నారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ సందర్భంగా 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసినట్లు తెలిపారు. దానిలోని 10 సూత్రాలలో ఇంధన పొదుపు ఒకటి అని ఆమె చెప్పారు.