కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం కుర్చీలాట ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఉత్కంఠభరితంగా అధికార మార్పిడి చర్చలు కొనసాగుతున్నాయి. సిద్ధరామయ్య-డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కీలక ములుపు తిరిగింది. కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ వైపు మొగ్గుచూపుతుంది. దీంతో సిద్దరామయ్య కాంగ్రెస్ పెద్దల ముందు పలు డిమాండ్లు పెట్టారు. తన వర్గానికి చెందిన వారికి పలువురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబట్టారు. అలాగే తమ వర్గం వారికి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడి పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే పలువురు డిప్యూటీల ప్రతిపాదనకు డీకే శివకుమార్ ఒప్పుకునే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలోనే డీకే శివకుమార్ ఉండనున్నారు. రేపు ఉదయం బెంగళూరుకు వెళ్లి సిద్ధరామయ్యతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎంగా డీకే… పలువురు డిప్యూటీల ప్రతిపాదనలు
0
61
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


