స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో వేడుకల నిర్వహణ, ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. సమీక్ష అనంతరం దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ ప్రణాళిక చేస్తారు. మంత్రులు, ఉన్నతాధికారుల సలహాలు సూచనలు అనంతరం సీఎం కేసీఆర్ తుది రూపు ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే జూన్ 2 నుంచి 21 వరకు వైభవోపేతంగా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలు నిర్వహించేందుకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
0
330
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


