చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్

డీఎస్సీలో స్కామ్‌లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ” ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి. మా హయాంలో ఒకే లక్షా నోటిఫికేషన్‌తో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఉద్యోగ భర్తీలో ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు సృష్టించాం. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చాం. చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే. 4 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించాం. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగకుండా కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు. వీళ్లు చేసిన స్కామ్‌లతో ఎంతో మంది కన్నీళ్లు పెడుతున్నారు. అక్రమాలను ఇక్కడి నుంచే ఆజ్యం పోశారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను SCERTకే అప్పగించారు. రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ,.. అప్‌లోడ్ చేసే పనిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. తప్పు బయటపడితే నెపం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టొచ్చనే ఇలా చేశారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి.. ఆ పరీక్షల్లో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ “..? డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి”.. అని అన్నారు.

Latest Articles

షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారు-చంద్రశేఖర్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీ భేటీ ముగిసింది. క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు కామారెడ్డి నేత, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్