స్వతంత్ర వెబ్ డెస్క్: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి లేఖ పంపిన చంద్రబాబు..ఈ నెల 25వ తేదీనే జడ్జికి లేఖ రాశారట. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖ రాశారు చంద్రబాబు. నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉందని.. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు.. ఫొటోలు తీశారని లేఖలో చంద్రబాబు వివరించారు. ఆ ఫుటేజ్ ను స్వయంగా పోలీసులే లీక్ చేశారని.. నా రెప్యూటేషన్ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారని ఆగ్రహించారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని.. దీనికి సంబంధించిన లేఖను తూ. గో జిల్లా ఎస్పీకు ఈ విషయమై లేఖ కూడా వచ్చిందన్నారు బాబు. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని లేఖలో చంద్రబాబు వివరించారు. నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారు….ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని మండిపడ్డారు.