సీఎం జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ చేపట్టిన నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ఆయన ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మెరుగైన ఫలితాలుంటాయని లక్ష్మీనారాయణ అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. అంగన్వాడీల్లో చిన్నపిల్లల పౌష్టికాహారం చాలా బాగుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా బాధితుల వద్దకే వెళ్లి మందులు ఇవ్వడం శుభపరిణామమని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

కాగా శ్రీశైలంలో జేడీ లక్ష్మీనారాయణ చదువుకున్న స్కూలులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోంది. ఈ సమ్మేళానికి స్థానిక ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డిని ఆహ్వానించేందుకు శ్రీశైలం వెళ్లారు. అయితే అక్కడ జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఉన్నారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణను ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఈ సందర్బంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ప్రశ్నంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ‌ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైస్ జగన్‌ను సీబీఐ కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశారు. ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్