Centuary Mattresses: బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు

హైదరాబాద్, 29 ఆగస్టు 2023: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును నియమించినట్లుగా ప్రకటించింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన పీవీ సింధును అంబాసిడర్‌గా నియమించడం వల్ల తమ మ్యాట్రెస్ జాతీయ ప్రజాదరణ పొందుతుందని, ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను చేరుకోగలుగుతుందని సెంచురీ మ్యాట్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఉత్తమ్ మలానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

సెంచురీ ఇటీవలే జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీనితో, మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి కాపర్ జెల్ టెక్నాలజీకి మారడంలో ఇండస్ట్రీ లీడర్‌గా అవతరించింది. శరీరానికి ఒత్తిడి, ఉపశమనాన్ని అందించే సహజ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. కొత్త కాపర్ జెల్ సాంకేతికత మ్యాట్రెస్, ఉపరితలంపై శరీర వేడిని తగ్గిస్తుంది. ఈ ప్రత్యేక అంశాలు, కస్టమర్‌లకు సుఖనిద్రను కలిగిస్తాయి.

సెంచురీ మ్యాట్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఉత్తమ్ మలానీ గారు మాట్లాడుతూ, “సెంచురీ ఫ్యామిలీకి మా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధుని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాము. భాగస్వామ్య విలువలు, అంకితభావంతో సింధు సెంచురీకి సరిగ్గా సరిపోతుంది. సింధు వంటి ఛాంపియన్‌తో అనుబంధం ఉన్నందుకు మేము గర్విస్తున్నాము.” అని అన్నారు.

సింధు మాట్లాడుతూ, “సెంచురీ మ్యాట్రెస్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. కఠోరమైన శిక్షణ విజయానికి ఎంత ప్రాముఖ్యమో, అదే విధంగా సరైన మ్యాట్రెస్ కూడా మంచి నిద్రను కలిగిస్తుంది. సంపూర్ణ శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన స్లీప్ సొల్యూషన్స్ కోసం ప్రచారం చేస్తూ, సెంచురీ ప్రయాణంలో నేను ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నాను,” అని అన్నారు.

సెంచురీ మ్యాట్రెస్‌లు 18 రాష్ట్రాల్లో 4500+ డీలర్‌లు, 450+ ప్రత్యేక బ్రాండ్ స్టోర్‌లను కలిగి ఉంది. హైదరాబాద్, భువనేశ్వర్‌లో తయారీ ప్లాంట్‌లను కలిగి ఉంది.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్