ఇవాళ భిన్నంగా చేయాలనుకుంటున్నా… ఆత్మహత్యకు ముందు నీట్ అభ్యర్థి సెల్ఫీ వీడియో

నీట్‌ రీ ఎగ్జామ్‌కు రెండు రోజుల ముందు నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన జతిన్‌ కుమార్‌గా గుర్తించారు. అతను విజయ్‌నగర్‌లోని హెచ్-బ్లాక్ ప్రాంతానికి చెందినవాడు. నీట్‌ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి వరకు తన గదిలో చదువుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ కనిపించిన జతిన్.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు లేపేందుకు వెళ్లగా మృతదేహంగా కనిపించాడు.

సమాచారం అందుకున్న వెంటనే విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు కట్టిన తాడు తెగిపోయిన స్థితిలో ఉండగా, మృతదేహం నేలపై పడివున్నట్లు పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా జతిన్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, మరణానికి కొద్ది క్షణాల ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న 1 నిమిషం 4 సెకన్ల వీడియో లభించింది. ఆ వీడియోలో తన స్టడీ రూమ్‌ను చూపిస్తూ, “ఈ రోజు ఏదో భిన్నంగా చేయాలని అనుకుంటున్నాను” అని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న తాడును కూడా వీడియోలో చూపించినట్లు తెలిపారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్