జీవీ ప్రకాష్ కుమార్.. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం అందిస్తూ.. మరో వైపు హీరోగా నటిస్తూ.. కెరీర్లో దూసుకెళుతున్నాడు. అటు తమిళ్, ఇటు తెలుగులో క్రేజీ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే.. సీనియర్ హీరోల సినిమాలకు అయినా.. స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాలకు అయినా.. జీవీ మ్యూజిక్ కావాలంటున్నారు. అంతలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు జీవీ. ఇంతకీ.. జీవీ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు ఏంటి..?
టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే.. థమన్ పేరు వినిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కు కూడా బాగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు దేవిశ్రీ హీరోగా ఎల్లమ్మ అనే సినిమా చేస్తుండడంతో మ్యూజిక్ పై కన్ సన్ ట్రేషన్ తగ్గించారని.. ప్రచారం జరుగుతుంది. దీంతో జీవీ ప్రకాష్ కి మరింత క్రేజ్ పెరిగింది. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఓ వైపు తమిళ్, మరో వైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ జెండా పాతే పనిలో ఉన్నారు. ప్రస్తుతం జీవీ.. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రానికికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమా భాగస్వామ్యంలో రూపొందుతున్న చిత్రం ఆకాశంలో ఒక తార. ఈ మూవీ షూటింగ్ టైం నుంచే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి కూడా జీవీ ప్రకాష్ కుమారే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అనిల్ రావి గత రెండు చిత్రాలకు మ్యూజిక్ చేసే ఛాన్స్ భీమ్స్ సిసిరోలియోకి ఇచ్చారు. ఆయన బ్లాక్ బస్టర్ అనేలా సాంగ్స్ అందించారు. అయితే.. ఈసారి తీస్తున్న వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కి జీవీని ఎంచుకోవడం విశేషం. ఈ మూవీకి సంబంధించి జీవీతో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం.. అనిల్ తనదైన స్టైల్ లో ప్రమోట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీకి కూడా జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న మకుటం చివరి దశలో ఉంది. సుహాస్ కోలీవుడ్ కు పరిచయమవుతున్న మందాడి మీద బిజినెస్ పరంగా క్రేజ్ నెలకొంది. జానర్స్ పరంగా ఒకదానితో మరొకటి సంబంధం లేని సినిమాలు చేస్తున్న జీవీ ప్రకాష్ కు ఇవన్నీ సవాల్ విసిరేవే. ఈ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. మాస్ మహారాజా రవితేజ ఇరుముడికి మ్యూజిక్ అందించడం మరో ఎత్తు అని చెప్పచ్చు. వీటన్నింటికీ బెస్ట్ మ్యూజిక్ అందిస్తే.. జీవీ ప్రకాష్ పేరు మరింతగా మారుమ్రోగడం.. మరిన్ని ఆఫర్స్ అందుకోవడం ఖాయం.


