కాంగ్రెస్ సర్కార్‌పై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైరయ్యారు. సింగరేణి కాలరీస్‌కు వెళ్తే అడ్డుకున్నారని.. తప్పు చేయకుంటే మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో అవకతవకలు, కుంభకోణాలు జరుగుతున్నాయని .. వాటిపై విచారణ చేయించే దమ్ము మీకుందా? అంటూ నిలదీశారు. హౌస్ కమిటీ వేస్తారా? సీబీఐకి అప్పగిస్తారా? చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. తాడిచర్ల భూముల కేటాయింపులో.. రూ.20వేల కోట్ల కుంభకోణమని ఆరోపణలు వచ్చాయన్నారు. మరి దానిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అడిగారు. సైట్ విజిట్ నిబంధనలు తీసుకొచ్చి.. అడ్డగోలుగా టెండర్లను కేటాయిస్తున్నారని ఏలేటి విమర్శించారు. సోలార్ ద్వారా రూ.200 కోట్ల కుంభకోణం చేశారని ఆయన ఆరోపించారు.
హౌస్ కమిటీ వేస్తారా? సీబీఐకి అప్పగిస్తారా?- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
0
44
Previous article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


