జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?

దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని.. క్రేజీ పాన్ ఇండియా స్టార్ తో రాజమౌళి మూవీ చేయబోతున్నట్టుగా ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఆ క్రేజీ పాన్ ఇండియా స్టార్ ఎవరు..? అసలు ప్రచారంలో ఉన్న వార్త నిజమేనా..? లేక గాసిప్పా..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటించే ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మాణమవుతోంది. అంతర్జాతీయంగా తెలుగు సినిమా మార్కెట్ ను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ క్రేజీ మూవీ తీస్తున్నారు జక్కన్న. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే.. అనౌన్స్ మెంట్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్న రాజమౌళి ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాజమౌళి నెక్ట్స్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఇటీవల అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్స్ లో రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని లాక్ చేశారని, మగధీర, ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడోసారి రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయబోతున్నారని ప్రచారం మొదలైంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలు అందరూ ఒకటి రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుచేత రాజమౌళి.. రామ్ చరణ్‌ తో సినిమా చేయాలి అనుకుంటున్నారని.. ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా..? కాదా అంటే.. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం.. అలాంటిది ఏమీ లేదని.. రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా పైనే ఫోకస్ పెట్టారని.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి డిష్కసన్స్ జరగడం లేదని సమాచారం. సో.. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్