మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఘటన మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం పరభణి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యశ్వాడి గ్రామం ఛత్రపతి సంభాజీనగర్కు సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.


