పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ మూవీకి సీక్వెల్ ఉందని ప్రకటించారు కానీ.. ఇంత వరుకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్ డేట్ లేదు. అయితే.. ఇప్పుడు ఓజీ 2 ప్లాన్ మారిందని.. ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరో వైపు ఓజీ డైరెక్టర్ సుజిత్.. నానితో ఓ మూవీ చేయాల్సివుండడంతో ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ.. ఓజీ 2 ప్లాన్ నిజంగానే మారిందా..? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో ఓజీలో అలా చూపించారు డైరెక్టర్ సుజిత్. అందుకనే.. ఓజీ మూవీ అంతలా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేసి.. పవర్ స్టార్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. అయితే.. ఓజీ సీక్వెల్ ఓజీ 2 ఉందని హింట్ ఇచ్చారు కానీ.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇటీవల ఓజీ 2 ప్లాన్ మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓజీ మూవీని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. అయితే.. ఇప్పుడు ఓజీ 2 చిత్రాన్ని డీవీవీ బ్యానర్లో కాకుండా వేరే బ్యానర్లో నిర్మించేలా ప్లాన్ మారిందని తెలిసింది. పవన్ తో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్, యు.వీ క్రియేషన్స్, నిర్మాత రామ్ తాళ్లూరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ బ్యానర్స్ లో ఏదో ఒక బ్యానర్లో ఓజీ 2 ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.
ఓజీ 2 పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అయితే.. పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. అందుచేత ఓజీ 2 ఉంటుందా… ఉండదా..? అనేది సస్పెన్స్ గా ఉండేది కానీ.. ఈ సినిమా ఉంటుందని.. ఇటీవల పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ క్రేజీ మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. మరి.. ఎప్పుడు ఓజీ స్టార్ట్ కానుందంటే.. సుజిత్ ప్రస్తుతం లండన్లో ఉన్నారని.. అక్కడ నుంచి వచ్చిన తర్వాత పవర్ స్టార్ ని కలవనున్నారని తెలిసింది. ఈ మూవీ బడ్జెట్ గురించి అలాగే.. ఏ బ్యానర్లో సినిమా చేయాలి అనేది పవన్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారట సుజిత్. అయితే.. ఇయర్ ఎండింగ్లో ఓజీ 2 సెట్స్ పైకి రావచ్చని టాక్ వినిపిస్తోంది. మరి.. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.


