- మంత్రి తలసానికి పర్యవేక్షణ బాధ్యతలు
- అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం
- రేపట్నుంచి సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఏపీ నేతలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాల అమలుకు అధిష్టానం రూపకల్పన చేస్తోంది. వచ్చే నెల నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. జనవరి చివరలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించనుంది. రేపట్నుంచి ఏపీకి చెందిన కొందరు నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
