22.7 C
Hyderabad
Wednesday, December 4, 2024
spot_img

హిమాచల్ ప్రదేశ్‌లో తగ్గిన బీజేపీ జోరు

  • గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన కమలనాథులు
  • హిమాచల్‌ ప్రదేశ్‌లో చతికిల పడిన బీజేపీ
  • మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్
  • 40 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • 25 చోట్ల లీడ్‌లో ఉన్న బీజేపీ

గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన కమలనాథులు.. హిమాచల్‌ ప్రదేశ్‌లో చతికిల పడ్డారు. హిమాచల్‌లో అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించే దిశగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది.

హిమాచల్ ప్రదేశ్‌ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 35 సీట్లు. ఈ మేజిక్ ఫిగర్‌ను ఇప్పటికే కాంగ్రెస్ అందుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు 40 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థులు 25 నియోజకవర్గాల్లో లీడింగ్‌లో ఉన్నారు. సెరాజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, సుందేర్ ‌నగర్‌ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రాకేశ్‌కుమార్‌ విజయం సాధించారు.

దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ కు హిమాచల్ ఫలితాలు కొత్త ఊపిరి పోశాయి. హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అత్యంత అవసరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశమైంది. హిమాచల్ ప్రదేశ్‌కు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పగ్గాలను ఎవరు అందుకుంటారనే విషయం ఉత్కంఠగా మారింది.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ప్రతిభాసింగ్ పేరు సీఎం పదవికి చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేసులో ఆమె ముందంజలో ఉన్నారు. ప్రతిభా సింగ్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ భార్య. మండీ లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఆమెనే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధిష్టానం నామినేట్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వీరభద్రసింగ్- ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్య పేరు కూడా వినిపిస్తోంది. సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన భారీ ఆధిక్యతో కొనసాగుతున్నారు. సీఎం రేసులో విక్రమాదిత్య పేరు కూడా వినిపిస్తోంది. యువకుడు కావడం వల్ల ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చే సంస్కృతి ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ 21, సీపీఎం 1, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. దాదాపు ఏడాదిన్నర కిందట జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం నాలుగు సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఒకటి మండి లోక్ సభ సెగ్మెంట్ ఒకటి కాగా…మిగతా మూడు అసెంబ్లీ సీట్లు. మండి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. మండి ఒక్కటే కాదు….మిగతా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ గెలిచింది. ఈ విజయాలు కాంగ్రెస్ శిబిరంలో జోష్ నింపాయి.

Latest Articles

సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడుపుతున్న బెల్టు షాపులు ఎత్తివేశారని అన్నారు. మొత్తం షాపులన్నింటినీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్