రూ. 500కోట్ల రుణాల మంజూరే లక్ష్యం – సీఈఓ ఏఎస్ రాజీవ్
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాజ్ డెక్కన్ లో ఎంఎస్‌ఎంఈ, రిటైల్ ఎక్స్పో నిర్వహించింది. ఈ ఎక్స్‌పోలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఈఓ ఏఎస్ రాజీవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోన్ మంజూరైన లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. తమ బ్యాంక్ నుంచి రూ.258 కోట్ల ఎంఎస్‌ఎంఈ రుణాలు, రూ.100 కోట్ల రిటైల్ లోన్స్ శాంక్షన్ చేసినట్లు ఆయన తెలిపారు.
రూ.500 కోట్ల రుణాల మంజూరు తమ టార్గెట్ అని తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తమ సేవలను విస్తరిస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణ డిప్యూటీ జీఎం ఆర్. జగన్మోహన్, స్వతంత్ర ఛానెల్ ఎండీ బి.కృష్ణప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.