Bandi Sanjay |ట్రిపుల్ ఆర్ (RRR) సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఝాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి, స్వరాలందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు RRR సినిమా చిత్ర యూనిట్ కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు నా శుభాకాంక్షలు అని తెలిపారు.
Read Also: RRRలోని ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవటం అభినందనీయం: వెంకయ్య నాయుడు
Follow us on: Youtube Instagram