స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భాస్కర్‌రెడ్డికి రక్తపోటురావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే భాస్కర్ రెడ్డికి చికిత్స అనంతరం..మళ్లీ జైలుకు తీసుకెళ్లారు అధికారులు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.