‘వ్యూహం’ సినిమాపై హైకోర్టులో వాదనలు

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రానికి సంబంధించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) బోర్డు ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనలను పరిశీలించి.. ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్‌ జడ్జి ధర్మాసనాన్ని ద్వి సభ్య ధర్మాసనం కోరింది. రివ్యూ కమిటీ సూచించిన మార్పులకు సంబంధించిన వివరాలను సింగిల్‌ జడ్జి ముందు ఉంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అలాగే 8వ తేదీనే వాదనలు వినాలని, అదే రోజు ఉత్తర్వులు వెలువరించాలని కోరింది.

వ్యూహం చిత్ర విడుదలకు సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ అమలును ఈ నెల 11వ తేదీ వరకు నిలిపివేస్తూ గత నెల 28న తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిర్మాత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రివ్యూ కమిటీ చెప్పిన సూచనలను పరిశీలించి ఉత్తర్వులు ఇవ్వాలని సింగిల్‌ జడ్జిని కోరింది. అనంతరం అప్పీల్‌ వాదనలను ముగించింది.

Latest Articles

బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్‌ అవ్వలేదు- రేవంత్‌ రెడ్డి

బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్‌ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్‌ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్