Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో చిరంజీవి, వెంకటేష్ సందడి

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నటి ప్రభ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 150 నుంచి 200 చిత్రాల్లో నటించారు. స్వర్గీయ దేవభక్తుని రమేష్, ప్రభ దంపతుల కుమారుడైన రాజా రమేష్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ్ రామ్ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయిఅపర్ణతో రాజా రమేష్ వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుమన్, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి, వై. విజయ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ప్రభ ప్రముఖ కూచిపూడి నృత్యాకారిణి కూడా. ప్రముఖ నాట్య గురువు వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నీడలేని ఆడది చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కమల్ హాసన్, చిరంజీవి తదితర హీరోలందరి పక్కనా హీరోయిన్ గా నటించారు. ముఖ్యంగా మహానటుడు ఎన్టీఆర్ రూపొందించిన దానవీరశూర కర్ణ చిత్రంలోని చిత్రం భళారేమి చిత్రం పాటలో ప్రభ అభినయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు. వారి ఇంట జరుగుతున్న ఈ శుభకార్యానికి తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తూ తరలివచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్