కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే.. ఏ డైరెక్టర్ అయినా వెంటనే ఓకే అనేవారు. అదంతా ఒకప్పుడు. అయితే.. ఇప్పుడు రజినీతో సినిమా అంటే.. సున్నితంగా నో చెప్పేస్తున్నారు. ఇది కోలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఎందుకు నో చెబుతున్నారు..? రజినీ సినిమాకి మళ్ళీ డైరెక్టర్ మారారా..? ఇదంతా నిజమేనా..? లేక గాసిప్పా..? అసలు సూపర్ రజినీ సినిమా తెర వెనుక ఏం జరుగుతోంది..?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కమల్ హాసన్ ఓ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు కానీ.. డైరెక్ట్ సెట్ కావడం లేదు. ఈ క్రేజీ మూవీకి ముందుగా రజినీతో అరుణాచలం మూవీ తీసిన సీనియర్ డైరెక్టర్ సుందర్‌ను ఎంచుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌తో డాన్ మూవీ తీసిన శిబి చక్రవర్తిని దర్శకుడిగా ఫైనల్ చేశారు. ఈ కాంబో గురించి కూడా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో రజినీ పాత్ర కోసం 80కి పైగా లుక్స్ డిజైన్ చేశాడంటూ సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ డైరెక్టర్ శిబికి ఎలివేషన్ ఇచ్చారు.
కానీ కొన్నాళ్లకు శిబి కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఏ సమాచారం లేదు. తర్వాత రజినీ సినిమా కోసం ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్ సినిమా తీసిన అశ్వత్ మారిముత్తు పేరు ప్రచారంలోకి వచ్చింది. కోలీవుడ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. రజినీ సినిమా.. అశ్వత్ మారిముత్తు చేతికే వెళ్లిందట. అతను నిర్మాత కమల్ హాసన్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. అయితే.. రజినీకి కథ చెప్పి ఒప్పించిన తర్వాత అప్పుడు ఈ సినిమాని అనౌన్స్ చేయమని చెప్పాడట.
రజినీ, అశ్వత్ మారిముత్తు కాంబో మూవీ గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోవడంతో.. ఇది కూడా క్యాన్సిల్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. అలాంటిది ఏమీ లేదని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక ట్రెండునెలల తర్వాత అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. అయితే.. రజినీతో సినిమా అంటే ఎందుకు డైరెక్టర్లు నో చెబుతున్నారంటే.. ఇక నుంచి తను చేసే సినిమాలు ఖచ్చితంగా సక్సస్ సాధించాలని రజినీ ఫిక్స్ అయ్యారట. అందుకనే.. స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. ఆయన్ని కథతో మెప్పించలేకే డైరెక్టర్లు తప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మరి.. రజినీ అనుకున్నట్టుగా మంచి కథలతో సినిమాలు తీసి ఇక నుంచి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందిస్తారేమో చూడాలి.


