తెలంగాణకు సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు, వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకోనివారికి మరో అవకాశం ఇచ్చామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని అన్నారు. మూడు పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారానికి అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పారు.
కుల సర్వేపై ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వేలో భాగస్వామ్యులు అయ్యేలాగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకొని… ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. సర్వే భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని మంత్రి పొన్నం కోరారు.