రాజకీయ పార్టీల నాయకులు కులగణన..సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా కుల గణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందన్నారు. ఇప్పటికి ఈ సర్వేలో పాల్గొనని వారు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే..తమ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ ను పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు ఇందులో తావు లేదని, గతంలో బీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా తామంతా సమాచారాన్ని ఇచ్చామని గుర్తు చేశారు.