పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అఘోరి హల్‌చల్ చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తణుకు పట్టణానికి చెందిన రాజేష్ నాథ్.. అఘోరి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రాజేష్ అఘోరియా ఇంటి వద్దకు వెళ్లి రాజేష్ నాథ్‌ను చంపుతానంటూ బెదిరించారు. అక్కడి నుంచి తణుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాజేష్ నాథ్ అఘోరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు స్పందించడం లేదని పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మహిళా పోలీసులు ఇద్దరు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. ఆమె ఒంటిపై పెట్రోల్ డబ్బాతో పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించారు. మహిళా పోలీసులు ఆమెను పట్టుకుని పెట్రోల్ లాక్కుని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికులు, పోలీసులు ఆమె ఒంటిపై నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కాసేపు అఘోరికి, పోలీసులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది.
అఘోరి మాట్లాడుతూ.. పెట్రోల్ ఎప్పుడూ తనతో ఉంటుందని.. లాంగ్ జర్నీ చేస్తాను కాబట్టి పెట్రోల్ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడూ పెట్రోల్ డబ్బాను క్యారీ చేస్తానని అఘోరి తెలిపారు.