ఎల్లుండి నుండి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 96 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు జీవితంలో తొలిమెట్టు మాత్రమే అని.. విద్యార్థులెవ్వరూ ఒత్తిడికి గురి కావొద్దని సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అన్నట్టు కాదన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీని కోరామని చెప్పారు. ఎండలు ఎక్కువ ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందీ రాకుండా మెడికల్ సదుపాయాలు ఉంటాయన్నారు. హాల్ టికెట్ల మీద ఈ సారి క్యూ ఆర్ కోడ్ ఉంటుందన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు సెంటర్లకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో పరీక్షల నిర్వహణపై సమీక్షలు జరిపామని కృష్ణ ఆదిత్య వివరించారు.