మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. మల్లిడి వశిష్ట్ మూవీ డైరెక్టర్. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కుదరలేదు. ఆతర్వాత సమ్మర్ లో వస్తుందని వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పుడు సమ్మర్ లో కూడా రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఏమైంది..? విశ్వంభర థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ కోసం విశ్వంభర రిలీజ్ త్యాగం చేశారు. ఆతర్వాత మే 9న విశ్వంభర రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడం వలన కుదరడం లేదట. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత గ్రాఫిక్స్ వర్క్ పై విమర్శలు వచ్చాయి. అందుకనే మరోసారి వర్క్ చేస్తున్నారు. ఓటీటీ డీల్స్ కూడా ఆలస్యం అయ్యాయి. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
విశ్వంభర ఎంత వరకు అయ్యిందంటే.. ఒక పాట బ్యాలెన్స్ ఉంది. అలాగే ప్యాచ్ వర్క్ కూడా చేయాల్సివుంది. త్వరలోనే మిగిలిన సాంగ్ అండ్ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మే 9 కుదరకపోతే జూన్ 27 రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు జూన్ లో కూడా వచ్చే ఛాన్స్ లేదని సమాచారం. మరి.. విశ్వంభర రిలీజ్ ఎప్పుడంటే.. ఆగస్టు 22 అయితే చిరంజీవి పుట్టిన రోజు కాబట్టి, ఇంకాస్త క్రేజ్ ఉంటుందని, ఫ్యాన్స్ కి కూడా ఓ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. మరి.. విశ్వంభర ఎంత వరకు మెప్పిస్తుందో..? ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.