32.1 C
Hyderabad
Thursday, February 26, 2026
spot_img

సనాతన సేవ కోసమే ఈ సినిమా తీసాం: మనోజ్ ముంతాషిర్ శుక్లా

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆదిపురుష్‌లోని కొన్ని డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆ సినిమా డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఇటీవలే ఈ విషయంపై వివరణ ఇచ్చినా.. ఆయనపై విమర్శలు ఆగకపోవడంతో తాజాగా మరో ట్వీట్‌ పెట్టారు. మూడు గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు. ‘ఆదిపురుష్‌’లో ఉన్న ‘జై శ్రీరాం’, ‘శివోహం’, ‘రామ్‌ సీతారామ్‌’ వంటి గొప్ప పాటలు నా కలం నుంచి పుట్టినవే. మీరు ఈవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అనుకుంటున్నా’’.. నన్ను నిందించిన వారిపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు.. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీసాము అని తెలిపారు.

ఆదిపురుష్‌’ కోసం నేను 4000 లైన్లకు పైగా డైలాగులు రాశాను. వాటిల్లో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోంది. అందుకే మూవీ యూనిట్‌ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. ఒక వారంలో ఈ మార్పును చేయనున్నాం. మీ అందరి సూచనలను గౌరవిస్తున్నాం’’ అని ట్విటర్‌ వేదికగా తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్