స్వతంత్ర వెబ్ డెస్క్: ఆదిపురుష్‌లోని కొన్ని డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇటీవలే ఈ విషయంపై వివరణ ఇచ్చినా.. ఆయనపై విమర్శలు ఆగకపోవడంతో తాజాగా మరో ట్వీట్ పెట్టారు. మూడు గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు. ‘ఆదిపురుష్’లో ఉన్న ‘జై శ్రీరాం’, ‘శివోహం’, ‘రామ్ సీతారామ్’ వంటి గొప్ప పాటలు నా కలం నుంచి పుట్టినవే. మీరు ఈవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అనుకుంటున్నా’’.. నన్ను నిందించిన వారిపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు.. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీసాము అని తెలిపారు.
ఆదిపురుష్’ కోసం నేను 4000 లైన్లకు పైగా డైలాగులు రాశాను. వాటిల్లో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోంది. అందుకే మూవీ యూనిట్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. ఒక వారంలో ఈ మార్పును చేయనున్నాం. మీ అందరి సూచనలను గౌరవిస్తున్నాం’’ అని ట్విటర్ వేదికగా తెలిపారు.