తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ మహిళా నాయకురాలు తమిళ నటి కస్తూరి తెలుగు ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రాజుల కాలంలో సేవకులుగా పని చేసేందుకు తెలుగు ప్రజలు తమిళనాడుకు వలస వచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇటీవల తమిళనాడులో బీజేపీ నిర్వహించిన ఓ సభలో ఆమె మాట్లాడుతూ.. ద్రవిడ సిద్ధాంత వాదులపై విరుచుకపడ్డారు.

300 ఏళ్ల కిందట రాజుల అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు విచ్చేశారని కస్తూరి అన్నారు. అలా వచ్చిన వారే ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. మరి ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్న బ్రాహ్మణులను తమిళులు కాదని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం స్టాలిన్ కేబినెట్‌లో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారున్నారని గుర్తుచేశారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు… ఇతరుల భార్యలపై మోజుపడొద్దు… ఒక్కరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెప్పడం వల్లే ద్రవిడ సిద్ధాంతులు వారిని వ్యతిరేకిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Latest Articles

నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS మహేంద్రగిరి

విశాఖపట్నంలో భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎన్-14ఏ జెట్టీ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్