వందేళ్లకుపైగా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న రోటరీ సంస్థ తాజాగా మెంటల్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మనోజ్ఞ పేరుతో వరుస కార్యక్రమాలు చేపట్టింది. ఈ మనోజ్ఞ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ యాక్టర్ కృష్ణ చైతన్య ఎంపికయ్యారు. ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎంపికవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కృష్ణ చైతన్య చెప్పారు. మనోజ్ఞ కార్యక్రమ ప్రారంభోత్సవంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ బి శంకర్ రెడ్డి, కార్యక్రమ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఛైర్ మెంటల్ హెల్త్ రోటరేరియన్ డాక్టర్ వాసుప్రద కార్తిక్, సపోర్టింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న సీఎండీ మా హాస్పిటల్స్ రోటరేరియన్ మిస్ సునీత కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోటరీక్లబ్ మనోజ్ఞ కార్యక్రమ బ్రాండ్ అంబాసిడర్‌గా కృష్ణ చైతన్య
0
406
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


