Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

టూరిజంలో నూతన వికాసం

      పర్యాటకరంగం అంటే ఒకప్పుడు సమీపానగల గుళ్లు, గోపురాలు చూడటమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పర్యాటకరంగం పరిధి విస్తృతమైంది. పర్యాటకరంగం ప్రస్తుతం పరిశ్రమగా మారింది. లెక్కలు తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో కనీసం ఒక్కరైనా పర్యటకరంగ పరిశ్రమతో సంబంధం ఉన్నవారే అయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పర్యాటకరంగంలో మన దేశం కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధినే సాధించింది. భారతదేశంలో కోట్లాది మందికి టూరిజం ఉపాధి కల్పిస్తోంది.

        పర్యాటకరంగ పరిధి విస్తృతమవుతోంది. పర్యాటకరంగం అంటే తొలిరోజుల్లో దగ్గర్లలోని గుళ్లు, గోపురాలు చూడటమే అన్నట్లు ఉండేది. అయితే ప్రపంచవ్యాప్తంగా సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావం పర్యాటకరంగంపై కూడా పడుతోంది. ఫలితంగా పర్యాటకరంగం పరిధి పుణ్య క్షేత్రాలు దాటింది. మరింతగా విస్తృతమైంది. పర్యాటకరంగం ప్రస్తుతం పరిశ్రమగా మారింది. లెక్కలు తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో కనీసం ఒక్కరైనా పర్యటకరంగ పరిశ్రమతో సంబంధం ఉన్నవారే అయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పర్యాటకరంగంలో మన దేశం కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధినే సాధించింది. భారతదేశంలో కోట్లాదిమందికి టూరిజం ఉపాధి కల్పిస్తోంది. మనదేశంలో పర్యాటకరంగ పరిస్థితి ఆశాజనకంగా ఉంది. దేశ ఆర్థికరంగాన్ని నిలబెడుతున్న వాటిలో పర్యాటక రంగం కూడా ఉంది. 2018 నాటి లెక్కల ప్రకారం పర్యాటకరంగం దేశవ్యాప్తంగా 4.26 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. జీడీపీలో కూడా పర్యాటక రంగం వాటా ఎక్కువగానే ఉంది. దీంతో, భారత ప్రభుత్వ సంతృప్తి పడలేదు. భారత జీడీపీలో పర్యాటకరంగం వాటా రూ.14 లక్షల కోట్లు. పర్యాటకపరంగా దేశీయంగా ఉన్న అవకాశాలను చూస్తే ఇది చాలా తక్కువ.రాబోయే రెండు దశాబ్దాల్లో దేశీయ పర్యాటకరంగాన్ని లక్ష కోట్ల డాలర్లకు తీసుకువెళ్లాలంటే మౌలిక వసతుల కల్పన కోసం నిధులు భారీగా కేటాయించాలి.మనదేశంలో పర్యాటకానికి ఉన్న అవకాశాల దృష్ట్యా, అనేక బడా సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. అయితే ఈ సంస్థలకు ప్రోత్సాహ కాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వాలు చేపట్టాలి.

        ప్రముఖ దేవాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం 2014లో ప్రసాద్ పథకం తీసుకొచ్చింది.అలాగే ‘స్వదేశ్‌ దర్శన్‌’కార్యక్రమం కింద దర్శనీయ స్థలాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనిస్తోంది. ఇదిలా ఉంటే చారిత్రక ప్రదేశాల కోసం మరో కొత్త పథకం తీసుకువస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి… ‘ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌ …. పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాలతో పర్యాటకులను ఆకట్టు కోవడంలో కేంద్రం ప్రభుత్వం విజయవంతమైంది. సమీప భవిష్యత్తులో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ఇండియా లక్ష్య సాధనలో దేశీయ పర్యాటకరంగం కీలకపాత్ర పోషించనుంది. కాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్‌లో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. ఇక్కడి ఆధ్యాత్మికతను, సంస్కృతిని, సంప్రదాయాలను అనుభూతి చెందడానికి లక్షలాది మంది విదేశీ యాత్రీకులు ప్రతి ఏడాది భారత్‌కు వస్తుంటారు. అంతేకాదు దేశీయంగానూ లక్షలమంది తీర్థయాత్రలు చేస్తున్నారు.

       ఇదిలా ఉంటే తాజాగా దీవులు, బీచ్‌ టూరిజం అభివృద్ది పైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను విదేశీ, దేశీయ విహారయాత్రీకులకు గమ్యస్థానాలుగా తీర్చిదిద్ద డానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇందులో భాగంగా పోర్టుల అనుసంధానం, మౌలిక సదుపా యాలు, రవాణా, ఆతిథ్య వసతుల కల్పన ప్రధాన అంశాలుగా కేంద్రం గుర్తించింది. అరేబియా సముద్రం లో 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న లక్షద్వీప్‌లో 36 దీవులున్నాయి.ఆకట్టుకునే బీచ్‌లు, ఉల్లాస పరచే సముద్ర క్రీడలు, వైవిధ్యమైన వృక్ష , జంతుజాలాలతో పాటు పర్యాటకులకు ఇవి మధురా నుభూతి కలిగిస్తున్నాయి.కాగా పర్యాటకును ఆకర్షించేలా లక్షద్వీప్ సహా ఇతర దీవులు తీర్చిదిద్దుతామని ఇటీవల మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలతో రాష్ట్రాలు పర్యాటకరంగాన్ని అభివృద్ది చేసేలా ప్రోత్సహిస్తామన్నారు నిర్మలా సీతారామన్ . దాదాపు ఐదేళ్ల కిందటి కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా, అనేక దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. కోవిడ్ దెబ్బకు యావత్ ప్రపంచం, ఇంటి గడపకే పరిమితమైంది. గడప దాటి బయటకు వచ్చే జనమే కరువయ్యారు. వీథులు,గల్లీలు,చౌరాస్తాలు అన్నీ నిర్మానుష్యమయ్యాయి.

      కోవిడ్ తీవ్రత తగ్గిన తరువాత, పర్యాటకరంగం మళ్లీ జోరందుకుంది. సాధారణ ప్రజలు, సూట్‌కేసులు సర్దుకు న్నారు. పిల్లాపాపలను తీసుకుని పర్యాటకప్రదేశాలు చూడ్డానికి బయల్దేరారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో, మరోసారి పర్యాటకరంగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని కోసం కేంద్రం పక్కా ప్రణాళిక తయారు చేసింది. రైలు, రోడ్డు, విమాన మార్గాల అనుసంధానానికి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. అలాగే, మౌలిక వసతులు కల్పనకు కేంద్రం పెద్ద పీటవేయడం మొదలెట్టింది. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో పనిచేయడానికి భారత్ రెడీ అయింది. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి, వికాస్ భీ…విరాసత్ భీ అనే నినాదంతో కేంద్రం ముందుకు వెళుతోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్