బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏడు అంతస్తుల రెస్టారంట్‌లో మంటలు చెలరేగి కనీసం 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఢాకా బెయిలీ రోడ్డులోని ఓ బిర్యానీ రెస్టారంట్‌లో రాత్రి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు చెప్పారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చామ న్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికం గా ఉన్నాయి.
బంగ్లాదేశ్ ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం
0
217
Previous article
Next article
Latest Articles
సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


