హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సినీనటులు ఇవాళ్టి నుంచి సందడి చేయనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్ వుడ్ కి చెందిన సినీ తారలు క్రికెట్ మ్యాచ్ లతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా CCL 10 వ సీజన్‌లో భాగంగా మరోసారి గ్రౌండ్ లో అడుగుపె ట్టనున్నారు . హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రోజుకి రెండు మ్యాచులు చొప్పున మూడు రోజుల పాటు మ్యాచు లు జరగనున్నాయియి. తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ ది షేర్స్ , చెన్నై రైనిస్ వర్సెస్ భోజ్ పురి దభాంగ్స్ మ్యాచు లు ఇవాళ జరుగతా యి . హీరో అఖిల్ కెప్టెన్సీ లో తెలుగు వారియర్స్ , ప్రముఖ యాక్టర్ సోను సూద్ కెప్టెన్ గా పంజాబ్ ది షేర్ తో పోటీ పడనున్నాయి.