Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్ఠం గా 78వేలు రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ‘పీఎం-సూర్యఘర్‌: ఉచిత విద్యుత్తు పథకం’ పేరుతో అమలుచేసే పథకానికి రాయితీని రెండు భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60శాతం, అంతకు పైబడిన యూనిట్లకు 40శాతం మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా 78వేలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమ కూరుస్తుంది. రెపోరేట్‌కు అదనంగా 0.5 శాతం వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7శాతం ఉంది.

      ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్‌ మీటరింగ్‌ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు 1,265 ఆదాయం వస్తుంది. అందులో 610ని బ్యాంకు రుణవా యిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపా రు. 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నవారికి 60వేలు, 3 కిలోవాట్ల ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నవారికి 78వేలు గరిష్ఠ రాయితీ అందుతుందని చెప్పారు. ఇంటి యజమానులు నేషనల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సౌర ఫలకాలు, ఇతర వస్తువులు విక్రయించే గుర్తింపు పొందిన విక్రేతల జాబితా దానిలోనే ఉంటుంది. లబ్ధిదారులు వారి ద్వారా వస్తువు లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సౌర వ్యవస్థను ఏర్పాటు చేశాక సంబంధిత డిస్కంలు ‘నెట్‌ మీట రింగ్‌’ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.

   ఈ రెండూ పూర్తయిన వెంటనే కేంద్రం రాయితీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తుంది. కోటి ఇళ్లపై ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంవల్ల దేశంలో కొత్తగా 30 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అందుబాటులోకి వస్తుంది. 25 ఏళ్లలో 72 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అనురాగ్‌ ఠాకుర్‌ వివరించారు. సెమీ కండక్టర్‌ల కొరత తీర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా సెమీకండక్టర్ హబ్‌ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. టాటా, పవర్‌ చిప్ తైవాన్ సంయుక్తంగా గుజరాత్‌లోని ధొలెరా ప్రాంతంలో ఈ ప్లాంట్‌ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్