ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. తన పర్యటనను అడ్డుకోవడానికి చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ నేతనలు రప్పిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ దుర్బుద్ధితోలడ్డూల తయారీ జంతువుల కొవ్వును కలిపారని, కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నంట్లుగా భయాందోళనలు సృష్టించారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పరిస్థితుల నుంచి టాపిక్ డైవర్టు చేయడానికి తిరుపతి లడ్డూ అంశమని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి డిక్లరేషన్‌ను తెరమీదకు తీసుకువచ్చారని విమర్శించారు. దేవుడి వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే మనస్థత్యం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు.