స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని కడియం గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ది అవినీతి పాలన అయితే 15 ఏళ్లు కేసీఆర్ పక్కనే ఉన్న శ్రీవారి వాటా ఎంత అని ప్రశ్నించారు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కడియంను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధిలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంది నాలుగవ స్థానం అని ఆనాడు ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిందని రాజయ్య గుర్తుచేశారు.