అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రధాని మోదీ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు. ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ను పట్టుకుని నీళ్లు తాగించారు. ఆ తర్వాత కోలుకున్న ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తనకు 83 ఏళ్లు వయస్సు ఉందని.. అంత త్వరగా చనిపోనని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే వరకు క్రియాశీలకంగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ టార్గెట్‌గా బీజేపీపై విమర్శలు గుప్పించారు.