నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్షబూననుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది బీజేపీ. ఈ మేరకు పార్టీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చింది కమలం పార్టీ. తప్పుడు హామీలతో కాలయాపన చేస్తూ రైతులనే కాదు.. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే ఎన్నికల హామీలపై పట్టుబడుతూ దీక్ష చేపట్టనున్నారు.