జైలర్ 2 ఆలస్యానికి.. అసలు కారణం ఏంటి..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా ప్లాపుల్లో ఉన్న టైమ్ లో సక్సెస్ అందించిన మూవీ జైలర్. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ సీక్వెల్ ను ఈ సమ్మర్ లో రిలీజ్ చేస్తామన్నారు కానీ.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఆతర్వాత జూన్ లో జైలర్ 2 రానుందని ప్రచారం జరిగింది. ఆతర్వాత ఆగష్టులో రావడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆగష్టులో కూడా జైలర్ 2 రావడం లేదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. జైలర్ 2 ఆలస్యానికి అసలు కారణం ఏంటి..?

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కూలీ సినిమా ప్లాప్ అవ్వడంతో జైలర్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. జూన్ నుంచి మూవీ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ ఆగష్టులో కూడా రావడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అవుతుంది అంటే.. షూట్ కంప్లీట్ అయినప్పటికీ.. కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తితో ఉన్నారట మేకర్స్. రజినీ కొన్ని రీషూట్ చేయాలని చెప్పారట.

స్వయంగా రజినీనే రీషూట్ చేయాలని చెప్పడంతో పోస్ట్ పోన్ తప్పదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. రజినీ నటించిన కూలీ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ మూవీ పై మరింత కేర్ తీసుకుంటున్నారట. అలాగే జైలర్‌ కి ఏమాత్రం తగ్గకుండా జైలర్‌ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాలనే లక్ష్యంతో రజనీకాంత్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఒక వైపు జైలర్‌ 2 షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉండగానే.. రజనీకాంత్‌ భారీ మల్టీస్టారర్‌ సినిమాను చేసేందుకు రెడీ అవుతుండడం విశేషం.

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌తో రజనీకాంత్‌ నటించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీని కమల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో అందరిలో ఆసక్తి కలిగించింది. ఈ క్రేజీ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఇక జైలర్ 2 రిలీజ్ ఎప్పుడంటే… కొత్తగా సెప్టెంబర్ 4న విడుదల అంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్