శ్రీలీల లవ్ లో పడిందా..?

శ్రీలీల.. కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే.. అగ్ర హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది.. స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే.. ఈ బ్యూటీ ఈ మధ్య నటించిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో ఈ కిసిక్ బ్యూటీ రూటు మార్చి కోలీవుడ్, బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు లవ్ లో పడిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంతకీ.. శ్రీలీల ఎవరితో లవ్ పడింది..?

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి సినిమాలతో కూడా సక్సెస్ సాధించింది. అయితే.. ఈ బ్యూటీ తర్వాత నటించిన ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించినా.. ఆమె పాత్రకు అంతగా పేరు రాలేదు. జునియర్, రాబిన్ హుడ్, మాస్ జాతర సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కెరీర్ టర్న్ అవుతుందని ఆశలు పెట్టుకుంటే… ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

అందుకనే.. ఈ బ్యూటీ కోలీవుడ్, బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందని టాక్ వినిపిస్తోంది. తమిళ్ లో ధనుష్ మూవీలో నటిస్తుంది. బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ కు జంటగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు శ్రీలీల లవ్ లో పడిందనే వార్త వైరల్ అయ్యింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్ కు హాజరైన శ్రీలీల స్టూడెంట్స్ తో సరదాగా ముచ్చటించింది. కాలేజ్ లోని స్టూడెంట్స్ శ్రీలీల‌ను లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవగా దానికి ఆమె వెంట‌నే రియాక్ట్ అవుతూ, ఆ ట్యాగ్‌కు అసలైన అర్హురాలు నయనతార అని చెప్పారు. అంతే కాకుండా.. నయనతార తనకు ఎంతో ఇష్టమైన నటి అని, ఆమె కెరీర్, వ్యక్తిత్వం తనకు ఇన్సిపిరేష‌న్ అని చెప్పడం విశేషం.

చెన్నై గురించి శ్రీలీల తన మనసులో మాటలను బయటపెట్టింది. చెన్నై ప్రజల ప్రేమ, ముఖ్యంగా చెన్నై దోశ తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఈ క్రమంలోనే నయనతార లాగానే తాను కూడా చెన్నైలో పెళ్లి చేసుకుంటానా.. లేదా అనేది మాత్రం త‌న‌కు తెలియదంటూ నవ్వుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ ఇలా మాట్లాడినప్పటి నుంచి శ్రీలీల లవ్ లో పడిందని.. అది కూడా చెన్నై అబ్బాయితో ప్రేమలో పడింది అంటూ ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా.. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి కబురు చెబుతుందేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. శ్రీలీల పెళ్లి గురించి త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్