37.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

రెంటల్ సిస్టమ్ వెర్సెస్ పర్సంటేజ్.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది..?

థియేటర్స్ ను పర్సంటేజ్ విధానంలో రన్ చేయాలని ఎగ్జిబిటర్స్ అంటుంటే..? రెంటల్ విధానంలో రన్ చేయాలని నిర్మాతలు.. అంటున్నారు. దీని వలన నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఇండస్ట్రీలో పెద్ద వివాదమే నడుస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నిర్మాతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతుంది. అయితే.. పెద్ది సినిమా రిలీజ్ ముందే ఈ వివాదం రావడానికి కారణం ఏంటి..? కావాలనే పెద్దికి ఇబ్బంది పెడుతున్నారా..? అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది..?

థియేటర్స్ కు జనాలు రావడం అనేది చాలా వరుకు తగ్గిపోయింది. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు మాత్రం జనాలు థియేటర్స్ కు వస్తున్నారు. చిన్న సినిమాలను చూడడానికి రావడం లేదు. కంటెంట్ బాగుందనే టాక్ వస్తే.. చూస్తున్నారు. అయితే.. ఓటీటీల్లోకి కొత్తగా రిలీజైన సినిమాలు చాలా తక్కువ టైమ్ లోనే వచ్చేయడం.. టిక్కెట్లు రేట్లు బాగా పెరిగిపోవడం తదితర కారణాల వలన జనాలు థియేటర్స్ కు రావడం అనేది తగ్గిపోయింది. దీని వలన ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. థియేటర్స్ ను రెంటల్ విధానంలో రన్ చేస్తే.. నిర్మాతకు లాభం ఉంటుంది కానీ.. ఎగ్జిబిటర్స్ కు అంతగా లాభం ఉండదు. అదే పర్సంటేజ్ విధానం అయితే.. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేసినప్పుడు కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి ఎగ్జిబిటర్స్ కు మంచి ఇన్ కమ్ వస్తుంది. అందుకనే.. ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ విధానం కావాలంటున్నారు. ఇప్పుడు క్రేజీ మూవీ పెద్ది వస్తుంది. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ విధానం కావాలని పట్టుబడుతుండడం వివాదస్పదం అయ్యింది.

అయితే.. ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు.

ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని మీరు దయచేసి గ్రహించండి అన్నారు నిర్మాత రవిశంకర్. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదని… అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్.. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం అన్నారు.

నాలుగైదు నెలల నుంచి సరైన సినిమా లేక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదని… సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందామని నిర్మాతలు అన్నారు. ఒక పద్దతి ప్రకారం చేసుకోవాలి. థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి. అన్ని థియేటర్లలో ఒకే రకమైన వసతులు ఉండవు కాబట్టి అన్నింటిని ఒకే గాడికి కట్టలేమని.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వసతులు మెరుగుపర్చాలని… ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిస్కారమవుతాయి.. అందరం కలిసికట్టుగా ముందుకి వెళ్దాం.. అని నిర్మాతలు అంటున్నారు. మరి.. నిర్మాతలు కోరుకుంటున్నట్టుగా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకుంటారేమో చూడాలి.

Latest Articles

కాళేశ్వరం వల్ల రాష్ట్రం అప్పులపాలైంది: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ (Adi Srinivas) కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అనుమతులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్