హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఫర్నిచర్ గోదాం పైభాగంలో రెండు అంతస్తుల నివాస ఫ్లాట్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు.
ఇక పోలీసులు భవనంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. లోపల ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో ఫైర్ ఫైటర్స్, పోలీసులు కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి.


