కేన్స్‌లో ఆలియాపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్

స్టార్‌ హీరోయిన ఆలియా భట్‌ (Alia Bhatt) తాజాగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival 2026) రెడ్ కార్పెట్‌పై తన స్టైలిష్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ స్టార్‌గా అంతర్జాతీయ వేదికపై మెరిసిన ఆలియా ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకోగా.. సోషల్ మీడియాలో మాత్రం కొందరు ట్రోలింగ్‌కు దిగారు.

కేన్స్ వేడుకల్లో అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్లు ఆలియాను పెద్దగా పట్టించుకోలేదంటూ కొన్ని వీడియోలు, పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ “అయ్యో పాపం.. అక్కడ మిమ్మల్ని ఎవరూ గుర్తించలేదు” అంటూ కామెంట్ చేశాడు. దీనికి అలియా తనదైన స్టైల్‌లో చమత్కారంగా స్పందించారు.

“అయ్యో పాపం అనాల్సిన అవసరం లేదు.. మీరు నన్ను గుర్తించారు కదా!” అంటూ ఆలియా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలియా ధైర్యంగా ఇచ్చిన సమాధానంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రోల్స్‌కు సైలెంట్‌గా కానీ స్ట్రాంగ్‌గా ఎలా కౌంటర్ ఇవ్వాలో అలియాకు బాగా తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు.

మే 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇప్పటికే పలువురు అంతర్జాతీయ, భారతీయ సినీ తారలు తమ ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

ఊర్వశీ రౌతేలా ప్రత్యేక లుక్‌

ఇక మరో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా( Urvashi Rautela) కూడా కేన్స్‌లో తన ప్రత్యేక లుక్‌తో వైరల్ అయ్యారు. ఆమె ధరించిన విలాసవంతమైన క్రిస్టల్ గౌన్ ధర దాదాపు రూ.1,491 కోట్లు ఉంటుందని ఫ్యాషన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేన్స్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన లుక్స్‌లో ఒకటిగా చెబుతున్నారు.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్