కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక గోపాలరావుపేటలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్రపరిణామాలకు దారితీసింది. భర్త అర్జున్‌కుమార్ తనను కొడుతున్నాడనే ఆరోపణతో భార్య దుర్గాభవాని బాత్రూంలో ఉపయోగించే యాసిడ్‌ను అతనిపై పోసింది. ఈ ఘటనలో అర్జున్ కుమార్‌కు గాయాలయ్యాయి. అర్జున్‌కుమార్‌ను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, దుర్గా భవాని అదే ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయిస్తామని భర్త బంధువులు డబ్బులు తీసుకుని మోసం చేశారని.. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనను కొడుతున్నాడని భర్తపై బాత్రూం యాసిడ్ పోసిన భార్య
0
89
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


