ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్

అతిపెద్ద ఐపీఓతో స్సేస్‌ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం సంస్థ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఈ కంపెనీ ఐపీఓలో 75 బిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఒక్కోటి 135 డాలర్ల చొప్పున 555.6 మిలియన్ల షేర్లను విక్రయించింది. స్పేస్‌ఎక్స్ ఐపీఓ పరిమాణం, 2019లో సౌదీ అరామ్కో చేసిన $29.4 బిలియన్ల లిస్టింగ్ కంటే రెట్టింపుకు పైగా ఉంది.

అధికారికంగా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌గా పిలువబడే ఈ సంస్థ, ఐపీఓ ధరకే అదనంగా 83.3 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసేందుకు అండర్‌రైటింగ్ బ్యాంకులకు ఓవర్-అలాట్‌మెంట్ ఆప్షన్‌ను ఇచ్చిందని ఆ ప్రకటనలో ఉంది. ఈ ఆప్షన్‌ను పూర్తిగా వినియోగించుకుంటే, ఈ డీల్ విలువ సుమారు 86 బిలియన్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే నాలుగు రెట్లకు పైగా డిమాండ్ ఈ ఐపీఓకు వచ్చిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

Latest Articles

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారంటూ ఆమె వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిటర్నింగ్‌ ఆపీసర్‌ ఆర్డర్‌ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఒకసారి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్